ఎట్టకేలకు కోహ్లి ఫామ్‌లోకి.. | Kohli leads RCB charge with fifty | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కోహ్లి ఫామ్‌లోకి..

Published Fri, Apr 5 2019 9:01 PM | Last Updated on Fri, Apr 5 2019 9:06 PM

Kohli leads RCB charge with fifty - Sakshi

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని కోహ్లి.. తాజా మ్యాచ్‌లో అర్థ శతకంతో మెరిశాడు. 31 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఐపీఎల్‌లో కోహ్లికి  ఇది తొలి హాఫ్‌ సెంచరీ.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించింది. పార్థివ్‌ పటేల్‌, కోహ్లిలు తొలి వికెట్‌కు 64 పరుగులు జత చేశారు. అయితే పార్ధివ్‌(25) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన డివిలియర్స్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. మరొకవైపు కోహ్లి బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 11 ఓవర్‌లో 90 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే కోహ్లి అర్థ శతకాన్ని సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement