బెంగళూరు: ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ పరాజయం చవిచూసింది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్.. నాణ్యమైన ఆల్‌రౌండర్లు.. సమర్థులైన బౌలర్లు ఉన్నా ఇంత వరకు గెలుపు రుచి చూడలేకపోయింది. ఎన్నో అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు ఇలా ఢీలా పడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది.
తాజాగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తొలుత ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించి నాల్గో స్థానంలో ఉంది. కేకేఆర్ జట్టు సమష్టిగా రాణించి విజయాల్ని సొంతం చేసుకుంటుంది. ప్రధానంగా ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఆ జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన సునీల్ నరైన్ తిరిగి జట్టులో చేరాడు.
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, ఏబీ డివిలియర్స్, స్టోయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగీ, టిమ్ సౌతీ, నవదీప్ షైనీ, చహల్, సిరాజ్
కేకేఆర్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లూకీ ఫెర్గ్యుసన్, ప్రసిద్ధ్ క్రిష్ణ
Comments
Please login to add a commentAdd a comment