కెప్టెన్ కోహ్లీ సెంచరీ, ఔట్
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 191 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 252/2, వ్యక్తిగత స్కోరు 98 వద్ద ఫోర్ కొట్టి టెస్లుల్లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. కానీ సెంచరీ చేసిన అనంతరం కౌశల్ బౌలింగ్లో జట్టు స్కోరు 255 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా మూడో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ 121 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
కోహ్లీ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే కౌశల్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయి డకౌట్ గా వెనుదిరిగాడు. కేవలం ఫుట్వర్క్ లోపంతోనే భారత టాపార్డర్ బ్యాట్స్మన్స్ ఇలా ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో కౌశల్ 2 వికెట్లు, ప్రసాద్, ఎంజెలో మాథ్యూస్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ధావన్ 121పరుగులు (237 బంతులు, 12 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
శ్రీలంకతో టెస్టులో మూడో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం 227 పరుగులు విరాట్ కోహ్లీ, ధావన్ నెలకల్పారు. గతంలో వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్ జోడి చేసిన 162 పరుగుల రికార్డును కోహ్లీ-ధావన్ జంట తిరగరాశారు.