ధోనితో కుల్దీప్ యాదవ్ (ఫైల్)
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తన మాటలను మీడియా వక్రీకరించిందని అన్నాడు. (చదవండి: ఔను! ధోనీ టిప్స్ చాలాసార్లు పనిచేయలేదు!)
‘ఎటువంటి కారణం లేకుండానే మీడియా నన్ను వివాదంలోకి లాగింది. ధోనికి వ్యతిరేకంగా నేను కామెంట్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవం. నేను ఎవరి మీద అనవసర వ్యాఖ్యలు చేయలేదు. మహి భాయ్ అంటే నాకు గౌరవముంద’ని ఇన్‌స్టామ్‌లో కుల్దీప్ యాదవ్ వివరణయిచ్చాడు. ధోని ఇచ్చిన సలహాలు చాలా సార్లు పనిచేయలేదని కుల్దీప్ అన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడు ఈ మేరకు స్పందించాడు. ‘ఆట మధ్యలో ధోని ఎక్కువగా మాట్లాడడు. అవసరం ఉందనుకుంటేనే ఓవర్స్ గ్యాప్‌లో మాట్లాడతాడ’ని కుల్దీప్ వెల్లడించాడు.
ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీని 2017లో వదులుకున్నాడు. 37 ఏళ్ల ధోని ఇప్పుడు విరాట్ కోహ్లి కెప్టెన్సీలో తాజా వన్డే వరల్డ్‌కప్ ఆడనున్నాడు. తాజాగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకుడిగా ధోని వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment