పుణే: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని జట్టులో లేకపోవడంతోనే కుల్దీప్ యాదవ్ విఫలమవుతున్నాడంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ''కుల్దీప్ రెండేళ్లుగా ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు ధోనీ వికెట్ల వెనుక నుంచి అతనికి సహకరిస్తున్నప్పుడు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసేవాడు. కానీ.. గత రెండేళ్ల నుంచి అతని బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అతను విసిరే స్లో గూగ్లీలు వర్క్‌వుట్ కావడం లేదు. అతని బౌలింగ్‌లో పస తగ్గిపోవడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లు సులువుగా ఎదుర్కొంటున్నారు.ధోనీ లేకపోవడంతోనే కుల్దీప్ బౌలింగ్‌లో వైవిధ్యం దెబ్బతింది. దాంతో.. టచ్ కోల్పోయాడని'' మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కనిపించిన కుల్దీప్ యాదవ్.. ఇప్పుడు ఏ ఫార్మాట్‌లోనూ కనీసం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన కుల్దీప్ దారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏమాత్రం వేరియేషనల్ లేని అతని బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదేశాడు. రెండో వన్డేలో అతని కారణంగానే ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో.. మూడో వన్డేలో అతనిపై వేటు పడడంతో అతని స్థానంలో నటరాజన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది.
చదవండి:
వైరల్: ఆ వేలు ఎవరికి చూపించావు..శార్దూల్
Comments
Please login to add a commentAdd a comment