
ఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, సూచనల్ని మిస్ అవుతున్నట్లు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఈ మధ్యకాలంలో సరైన ఫామ్ లేక సతమతమవుతున్న కుల్దీప్ ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన పరిమిత ఓవర్లు ఆటలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ దెబ్బతో కుల్దీప్‌కు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
తాజాగా కుల్దీప్ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపిక కాలేకపోయాడు. ధోని ఉన్న సమయంలో కుల్దీప్‌ను బాగా ప్రోత్సహించాడు. వికెట్ల వెనుక నుంచి కుల్దీప్ యాదవ్‌కి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. దాంతో.. కెరీర్ ఆరంభంలో అంచనాలకి మించి రాణించిన కుల్దీప్ యాదవ్.. మూడు ఫార్మాట్లలోనూ ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు. కానీ.. ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలోనే కుల్దీప్ ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' ధోనీ భయ్యా సలహాల్ని చాలా మిస్సవుతున్నా. అతను తన అనుభవంతో వికెట్ల వెనుక నుంచి నాకు విలువైన సలహాల్ని ఇచ్చేవాడు. అలానే క్లిష్ట పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేసేవాడు. ప్రస్తుతం వికెట్ల వెనుక రిషబ్ పంత్ ఉన్నాడు. కానీ.. అతను సలహాలు ఇవ్వాలంటే మరికాస్త అనుభవం కావాలి. ప్రతి బౌలర్‌కీ ధోనీ లాంటి ఆటగాడి అవసరం అవసరం’’ అని కుల్దీప్ యాదవ్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
చదవండి:
నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్