
బల్గేరియా ఓపెన్ సింగిల్స్ విజేత లక్ష్య సేన్
ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ 18–21, 21–12, 21–17తో రెండో సీడ్ జ్వొనిమిర్ దుర్కిన్‌జాక్ (క్రొయేషియా)పై గెలుపొందాడు.
ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పీటర్ గేడ్ (డెన్మార్క్) వద్ద పది రోజులపాటు శిక్షణ తీసుకున్న లక్ష్య సేన్ ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచాడు.