లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్ | Lee Chong Wei, Shixian Wang win India Open titles | Sakshi
Sakshi News home page

లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్

Published Mon, Apr 7 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్

లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్

 ఇండియా ఓపెన్


  న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో తమ జోరును కొనసాగిస్తూ లీ చోంగ్ వీ (మలేసియా), షిజియాన్ వాంగ్ (చైనా) తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ... మహిళల సింగిల్స్‌లో షిజియాన్ వాంగ్ విజేతలుగా నిలిచారు.

 

ఫైనల్స్‌లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ 21-13, 21-17తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించగా... షిజియాన్ వాంగ్ 22-20, 21-19తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది. 31 ఏళ్ల లీ చోంగ్ వీకిది 54వ టైటిల్ కాగా... ఇండియా ఓపెన్ నెగ్గడం మూడోసారి. గతంలో 2011, 2013లలో కూడా అతను ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు.

 

మరోవైపు షిజియాన్ వాంగ్ కెరీర్‌లో ఇది 15వ టైటిల్. పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో-మోగెన్సన్ (డెన్మార్క్) జోడి... మహిళల డబుల్స్‌లో తాంగ్ యువాన్‌తింగ్-యాంగ్ యూ (చైనా) జంట... మిక్స్‌డ్ డబుల్స్‌లో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) ద్వయం టైటిల్స్ సాధించాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement