shixian wang
-
సెమీస్ లో సైనా
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. శుక్రవారం ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)ను 21-16, 21-19తో ఓడించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నిచావోన్‌పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. -
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఈ రోజు జరిగిన మహిళలు సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ టాప్ సీడ్ చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ ను 21-19, 16-21, 21-15 తేడాతో మట్టికరిపించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న సైనా ఒక గంట 16 నిమిషాల్లోనే విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి సెట్ ను గెలుచుకుని మంచి ఊపుమీద ఉన్న సైనాకు రెండో సెట్ లో వాంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. కాగా, తిరిగి పుంజుకున్న సైనా.. మూడో సెట్ ను సునాయాసంగా గెలుచుకుని తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా 21-18 21-9తో ఎరికో హిరోసి (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
లీ చోంగ్ వీ, వాంగ్‌లకు టైటిల్స్
ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: ఈ సీజన్లో తమ జోరును కొనసాగిస్తూ లీ చోంగ్ వీ (మలేసియా), షిజియాన్ వాంగ్ (చైనా) తమ ఖాతాలో మరో టైటిల్‌ను జమచేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ... మహిళల సింగిల్స్‌లో షిజియాన్ వాంగ్ విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ 21-13, 21-17తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించగా... షిజియాన్ వాంగ్ 22-20, 21-19తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది. 31 ఏళ్ల లీ చోంగ్ వీకిది 54వ టైటిల్ కాగా... ఇండియా ఓపెన్ నెగ్గడం మూడోసారి. గతంలో 2011, 2013లలో కూడా అతను ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు షిజియాన్ వాంగ్ కెరీర్లో ఇది 15వ టైటిల్. పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో-మోగెన్సన్ (డెన్మార్క్) జోడి... మహిళల డబుల్స్‌లో తాంగ్ యువాన్‌తింగ్-యాంగ్ యూ (చైనా) జంట... మిక్స్డ్ డబుల్స్‌లో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) ద్వయం టైటిల్స్ సాధించాయి.