
మర్‌క్రామ్ క్యాచ్‌ను అందుకుంటున్న అయ్యర్
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన ఆరో వన్డేలో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్‌క్రామ్ ఇచ్చిన క్యాచ్‌ను గాల్లోకి ఎగిరి అద్బుతంగా ఒడిసి పట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 10 ఓవర్ ఐదో బంతిని మర్‌క్రామ్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా షాట్ కొట్టే యత్నం చేశాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ బంతి గమనాన్ని అంచనా వేస్తూ గాల్లోకి ఎగిరి బంతిని అంతేవేగంగా అందుకున్నాడు.
దాంతో మర్‌క్రామ్ నిరాశ పెవిలియన్‌కు చేరగా, భారత ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్.. ఈ మ్యాచ్‌లో చక్కటి క్యాచ్ ద్వారా శభాష్ అనిపించుకున్నాడు. దక్షిణాఫ్రికా 28 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(10),ఏబీ డివిలియర్స్(30)లు సైతం పెవిలియన్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment