
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా లంచ్ తరువాత ఓపెనర్ డీన్ ఎల్గర్(31)ను అవుట్ చేసిన అశ్విన్.. మరొక ఓపెనర్ మర్‌క్రామ్(94;150 బంతుల్లో 15 ఫోర్లు)ను కూడా అవుట్ చేసి సత్తాచాటాడు. మర్‌క్రామ్ కుదురుగా ఆడుతూ సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో అశ్విన్ వేసిన చక్కటి బంతికి వికెట్‌ను సమర్పించుకున్నాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 48 ఓవర్ మూడో బంతికి మర్‌క్రామ్ పెవిలియన్ చేరాడు. అశ్విన్ తన బౌలింగ్ గార్డ్‌ను మార్చుకుని మర్‌క్రామ్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులు ఓవర్ ద వికెట్ బౌలింగ్ వేయగా, మూడో బంతిని రౌండ్ ద వికెట్ రూపంలో విసిరాడు. దాంతో ఒక్కసారిగా తడబడిన మర్‌క్రామ్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన మర్‌క్రామ్.. రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. అయితే మర్‌క్రామ్ సెంచరీకి చేరువలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో నిరాశ అలుముకోగా, టీమిండియా శిబిరంలో ఆనందం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment