పుజారా, అశ్విన్, కోహ్లి(ఫైల్‌ఫొటో)
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్‌గా తనదైన ముద్రతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లి నోటి నుంచి ఓటమి అనే మాట రాదని సహచర ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. కేవలం విజయాల గురించి మాట్లాడే కోహ్లి.. దాన్ని తన నరనరాల్లో ఇముడ్చుకున్నాడన్నాడు. అసలు అతని శరీరంలో ప్రతికూల ఎముక అనేది లేదని కొన్ని సందర్బాల్లో తనకు అనిపిస్తుందని అశ్విన్ తెలిపాడు.
'ఎప్పుడూ కోహ్లి మాట్లడేది విజయం గురించే. ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా కోహ్లి వెనుకడుగు వేయడు. కేవలం విజయం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతనికి నెగిటివ్ బోన్ అనేది లేదేమో. కోహ్లి నోట ఓటమి మాట రాదు. అదే జట్టులోని సభ్యుల్ని మరింతగా రాటుదేలేలా చేస్తోంది. కోహ్లి ఏదైతే కోరుకుంటున్నాడో అది ఆటగాళ్లకు బాగా తెలుసు. అందుకే అంతా సమష్టిగా రాణిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఒక పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోహ్లికి ఇదే తొలి విదేశీ సిరీస్. ఇప్పటికే అత్యుత్తమ కెప్టెన్ల సరసన ఆడిన అనుభవ ఉన్న కోహ్లి కూడా అదే తరహాలో పయనిస్తున్నాడు' అని అశ్విన్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సభ్యుడిగా ఉన్న అశ్విన్.. ఆ సిరీస్‌ను భారత్ 1-2తో ఓడిపోయినప్పటికీ చివరి పోరాటం మాత్రం కొనసాగించామన్నాడు. తాము పరాజయం పాలైన తొలి రెండు టెస్టులో చాలా మంచి క్రికెట్ ఆడామని అశ్విన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment