ఇంచియాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించింది. తప్పక సత్తా చాటాల్సిన పోరులో ఇరు జట్లు తొలి రెండు క్వార్టర్లలో గోల్సేమీ సాధించలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్‌లో భారత్ దూకుడు పెంచింది. 40వ నిమిషంలో రఘునాథ్, 45వ నిమిషంలో వీరేంద్ర లక్రా గోల్స్ సాధించి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో చైనాకు ఓటమి తప్పలేదు. ఇక ఈ గెలుపుతో పూల్ ‘బి’లో భారత్ రెండో స్థానంలో నిలిచి కొరియాతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీస్‌లో పాకిస్థాన్-మలేసియా తలపడనున్నాయి.
మహిళల హాకీలో భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ' చివరి వ్యూచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో మలేసియాను చిత్తు చేసి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
పురుషుల హాకీ సెమీస్‌లో భారత్
Published Sat, Sep 27 2014 6:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement