పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (178 బంతుల్లో 117; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎల్గర్ (52), ఆమ్లా (48) రాణించారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 181/7తో బ్యాటింగ్ కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. ఫిలాండర్‌కు 5 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 81 పరుగుల ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా ప్రస్తుతం 432 పరుగులు ముందంజలో ఉంది.10,000 టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల ఎల్బీడబ్ల్యూలు నమోదయ్యాయి. ప్రదీప్ బౌలింగ్‌లో ఆమ్లా అవుట్ కావడంతో ఈ ఘనత నమోదైంది.
పట్టుబిగించిన దక్షిణాఫ్రికా
Published Thu, Dec 29 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement