చెన్నై : ధనాధన్ ధోని కళ్లు చెదిరే స్టంపింగ్‌లకు అభిమానులు మరోసారి ఫిదా అయ్యారు. పరుగులు చేయడంలో తడబడ్డ సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్‌కు 44 పరుగులు జోడించి పోరాడే స్థితిలో నిలిపిన ఈ మిస్టర్ కూల్ అనంతరం శ్రేయస్ అయ్యర్ (44), క్రిస్ మోరిస్ (0)ను స్టంపవుట్ చేసి చెన్నైకి విజయం దక్కేలా చేశాడు. దాంతో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ మరోసారి ‘టాప్’ లేపింది. 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు స్టంపవుట్‌లు జడేజా బౌలింగ్‌లోనే నమోదుకావడం గమనార్హం.
(చదవండి : చెన్నై సూపర్ ‘స్పిన్’ )
ఇన్నింగ్స్ 12 ఓవర్లో జడేజా విసిరిన అద్భుతమైన బంతి మోరిస్‌కు అందకుండా నేరుగా ధోని చేతిలో పడింది. అంతే.. క్షణకాలంలో బెల్స్ నేలకూలాయి. బ్యాట్స్‌మన్ కాలు గాల్లోనే ఉంది. ఇక మరో రెండు బంతుల అనంతరం.. 44 పరుగులతో ఢిల్లీని విజయతీరాలవైపు తీసుకెళ్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కూడా ధోని స్టంపింగ్‌కు తలవంచక తప్పలేదు. ఇక చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రాన్ తాహిర్ (4/12) ఢిల్లీ మెడకు తన స్పిన్ ఉచ్చు బిగించాడు. మరో స్పిన్నర్ జడేజాకు మూడు వికెట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment