
ఎంఎస్ ధోని
అమెరికా, లాస్‌ఎంజెల్స్‌లోని ఓ అభిమాని వినూత్నరీతిలో ..
లాస్ ఏంజెల్స్ : టీమిండియా మాజీకెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నరనే విషయం మరోసారి స్పష్టమైంది. అమెరికా, లాస్‌ఎంజెల్స్‌లోని ఓ అభిమాని వినూత్నరీతిలో ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో జెర్సీ ప్రతిబింబించేలా.. తన కారు నంబర్ ప్లేట్‌పై ఎంఎస్ ధోని అని రాసుకున్నాడు. ఈ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన అధికార ట్విటర్‌లో ‘లాస్ ఏంజెల్స్‌లో ధోని అభిమాని’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో వైరల్ అయింది. దటీజ్ తాళా! కింగ్ ఈజ్ బ్యాక్, సూపర్ అనే కామెంట్స్‌తో ధోని అభిమానులు సదరు అభిమానిపై పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Aaah, so the legendary Soppanasundhari is now in LA! #WhistlePodu #Thala 💛😋🦁 https://t.co/wUHiaUWqQW
— Chennai Super Kings (@ChennaiIPL) December 20, 2018
గతేడాది తిరిగి చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోని ఆజట్టుకు మరో టైటిల్ అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యంలోనే (2010, 2014, 2018) మూడు టైటిళ్లను నెగ్గింది. తాజా సీజన్‌కోసం జరిగిన వేలంలో చెన్నై ముగ్గురు ఆటగాళ్లను వదులుకుని కొత్తగా ఇద్దరిని జట్టులోకి తీసుకుంది. హర్యానా మీడియం పేసర్ అయిన మొహిత్ శర్మను రూ.5 కోట్లకు, రంజీ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.