హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆది నుంచి తడ‘బ్యాటు’కు గురైంది. సన్‌రైజర్స్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో ఎవిన్ లూయిస్(29), కీరోన్ పొలార్డ్(28), సూర్యకుమార్ యాదవ్(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్ శర్మ(11), కృనాల్ పాండ్యా(15)లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో స్టాన్‌లేక్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, షకిబ్ వుల్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది.
టాస్ గెలిచిన హైదరాబాద్.. ముంబైను ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. దాంతో ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, ఎవిన్ లూయిస్‌లు ఆరంభించారు. అయితే మ్యాచ్ రెండో ఓవర్‌లోనే స్టాన్‌లేక్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన ఆటగాడు ఇషాన్ కిషాన్(9) కూడా విఫలమయ్యాడు. అయితే కాసేపు లూయిస్ మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, రెండు సిక‍్సర్లతో ముంబై అభిమానుల్ని అలరించాడు. కాగా, జట్టు స్కోరు 54 పరుగుల వద్ద లూయిస్ అవుట్ కావడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. ఆపై కీరోన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లు బ్యాట్ ఝుళిపించే యత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment