సాక్షి, ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల రిఫరీ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ముంబైలోని వాంఖడే స్డేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుపై సన్‌రైజర్స్ జట్టు 31 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారని ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ భావించారు.
మ్యాచ్‌లో 16వ ఓవర్ వేసిన సిద్ధార్త్ కౌల్ ఓవర్ చివరి బంతికి ముంబై ఆటగాడు మయాంక్ మార్కండేను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు. కానీ వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ కౌల్.. ఔటైన క్రికెటర్ మయాంక్ మార్కండేను వెక్కిరించాడు. దీన్ని ముంబై ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎల్11 సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ జట్టుకు కౌల్ ప్రాతినిథ్యం వహించాడు. 9 వికెట్లు తీసిన కౌల్ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ టీం అఫీషియల్స్ (ఐపీఎల్ ఆటగాళ్ల ప్రవర్తనా నియమాళి) 2.1.4 ప్రకారం బౌలర్ సిద్ధార్త్ కౌల్ లెవల్ వన్ ప్రకారం తప్పు చేసినట్లు రిఫరీ గుర్తించారు. జరిమానా ఎంత అన్నది ఇంకా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపిన అనంతరం అతడి గేమ్ పాయింట్లలో కోత విధించే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటివి ఆటలో భాగమేనని, సన్‌రైజర్స్ హైదరాబాద్ మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment