ముంబై: ఐపీఎల్ 2018లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ పరుగుల(87) చెత్త రికార్డును రెండోసారి నమోదు చేసిన ముంబై.. 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
‘ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. పిచ్ స్వభావం ఎలాంటిదైనా కావచ్చు.. ఇంత చిన్న(118 పరుగుల) లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగల సత్తా మా జట్టుకు ఉంది. అయితే మా పాత్రను సరిగా పోషించలేకపోయాం. ఇలా ఎందుకు జరిగిందో బోలెడు కారణాలు చెప్పగలను. కానీ, మా లోపాలను మేమే ఎత్తి చూపుకోవడం ప్రస్తుతానికి ఇష్టం లేదు. ముమ్మాటికీ తప్పు మాదే. బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. వ్యక్తిగతంగా నేను కూడా చెత్తగా ఆడానని చెప్పక తప్పదు. తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో సన్‌రైజర్స్ బాగా ఆడారు’’ అని రోహిత్ చెప్పాడు.
మంగళవారం నాటి మ్యాచ్‌తో ఐదు ఓటములు మూటగట్టుకున్న ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. ముంబై తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 28న చెన్నైతో ఆడనుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 26న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్.. పంజాబ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment