హాకీ ఇండియా లీగ్
మొహాలీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ముంబై మెజీషియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఈ సీజన్‌లో గెలుపు కోసం ఎనిమిది మ్యాచ్‌లుగా మొహం వాచిపోయిన ముంబై ఆదివారం కళింగ లాన్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 3-2 తేడాతో నెగ్గింది. కెప్టెన్ టర్నర్ (17వ నిమిషం)లో సాధించిన గోల్‌తో ఖాతా తెరవగా ఆ తరువాత గ్లెగోమ్ (33వ), రవిపాల్‌సింగ్ (57వ)లు చెరో గోల్ చేశారు.
అయితే కళింగ లాన్సర్స్ జట్టులో నిజాముద్దీన్ (43వ), లూకాస్ విలా (58వ)లు సాధించిన రెండు గోల్స్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో చివరి మ్యాచ్ ఆడిన లాన్సర్స్ 17 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక మరో మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ వారియర్స్ 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాంచి రైనోస్‌ను ఓడించి తమ పాయింట్ల సంఖ్యను 35కు పెంచుకుంది. కాగా, రాంచి నాలుగో ఓటమితో 24 పాయింట్లకే పరిమితమై ఇంకా నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది.
ఎట్టకేలకు ముంబై గెలుపు
Published Mon, Feb 17 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement