ఫెదరర్ x నాదల్‌ | Nadal wins to set up dream Australian Open final vs Federer | Sakshi
Sakshi News home page

ఫెదరర్ x నాదల్‌

Published Fri, Jan 27 2017 8:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

ఫెదరర్ x నాదల్‌

ఫెదరర్ x నాదల్‌

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఫైనల్ సమరంలో చిరకాల ప్రత్యర్థులు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో స్పెయిన్ బుల్‌ నాదల్‌ 6-3, 5-7, 7-6(5), 6-7(4) 6-4 స్కోరుతో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించాడు. స్విస్ కెరటం ఫెదరర్ ఇంతకుముందే ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.

కెరీర్లో నాదల్‌ 14, ఫెదరర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించారు. గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో ఫెదరర్, నాదల్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడ్డారు. ఓవరాల్ గా ముఖాముఖి పోరులో నాదల్‌ 23-11తో ఫెదరర్పై ఆధిక్యంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో ఇద్దరూ ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ  నాదల్ గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement