
యూనివర్సిటీక్యాంపస్: ‘‘విద్యద్వారానే బాలికల సంరక్షణ సాధ్యమవుతుంది. చదువులేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. బాలికలు చదువుపైనే పూర్తిస్థాయి దృష్టిసారించాలి. చదువులో విజయం సాధిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోగలరు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అవి ఓటమివైపు పయణింపజేస్తాయి. ద్వేషం, గర్వం, కోపం తదితర గుణాలకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలం. ఇందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఎనిమిదో ఏటనే పదో తరగతి పూర్తి చేయగలిగాను. 13వ ఏట డిగ్రీ, 15 సంవత్సరాలకు పీజీ పూర్తిచేశాను. ఇండియా తరఫున ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికైన తొలి యువతిని. అమ్మ ఒడినే బడిగా చేసుకుని ఈస్థాయికి ఎదగలిగాను. బాలికల సంరక్షణ అందరి బాధ్యత’’–నైనాజైశ్వాల్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్, క్రీడాకారిణి