హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్ నియమితులయ్యారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్ నియమితులయ్యారు. శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సభ్యులంతా ఆయన నియామకానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. లోధా కమిటీ సిఫారసుల అమలులో భాగంగా ప్రస్తుతం అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ స్థానంలో నరేందర్ గౌడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.