డబ్లిన్: మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి అమేలియా కెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో అమేలియా 145 బంతుల్లో 31 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 232 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిండా క్లార్క్ (229 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. అమేలియాతో పాటు లీ కాస్పెరెక్ (113; 10 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 305 పరుగులతో ఐర్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది.
తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 440 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అమేలియా (5/17) విజృంభించడంతో ఐర్లాండ్ జట్టు 44 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. ఈ సిరీస్‌లోని మూడు వన్డేల్లోనూ 400 పైచిలుకు స్కోర్లు సాధించి వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా కివీస్ మహిళల జట్టు నిలిచింది.
అమేలియా 232 నాటౌట్
Published Thu, Jun 14 2018 1:08 AM | Last Updated on Thu, Jun 14 2018 1:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment