
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కివీస్ కైవసం చేసుకుంది.180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 91 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ పతనాన్ని శాసించారు.
వీరితో పాటు జాకబ్ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఐరీష్ బ్యాటర్లలో మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ క్లీవర్ 78(నాటౌట్) పరుగులుతో రాణించాడు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి టీ20 బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి: Rishabh Pant: రిషబ్ పంత్.. 'పరిపూర్ణమైన' క్రికెటర్‌లా కనిపిస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment