మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-2లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. న్యూజిలాండ్ 11.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. గప్టిల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదులుతోంది. అతనికి జతగా కోరీ అండర్సన్(2) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్ విలియమ్సన్(17) తొలి వికెట్ గా అవుట్ కాగా, మున్రో(7) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది.
భారీ స్కోరు దిశగా కివీస్
Published Tue, Mar 22 2016 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement
Advertisement