మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా మంగళవారం ఇక్కడ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.