ఆసీస్పై న్యూజిలాండ్ గెలుపు | New Zealand Women won by 6 wickets | Sakshi

ఆసీస్పై న్యూజిలాండ్ గెలుపు

Mar 21 2016 6:32 PM | Updated on Sep 3 2017 8:16 PM

ఆసీస్పై న్యూజిలాండ్ గెలుపు

ఆసీస్పై న్యూజిలాండ్ గెలుపు

టి20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

నాగ్పూర్: టి20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ విసిరిన 104 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు సుజీ బేట్స్(23), ప్రీస్ట్(34) జట్టుకు శుభారంభాన్ని అందించడంతో న్యూజిలాండ్ విజయం లాంఛనమైంది. ఆ తరువాత డివైన్(17), మెగ్లాషన్(11)లు మోస్తరుగా రాణించి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఇక చివర్లో అమీ సాటర్ వైట్(16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో న్యూజిలాండ్ ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ జట్టులో ఎల్లీసీ పెర్రీ(42), జోనాసేన్(23), మూనీ(15 నాటౌట్),బ్లాక్ వెల్(10)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో కాస్పెరక్ మూడు వికెట్లు సాధించగా,బెర్మింగ్హమ్కు రెండు, డివైన్, సాటర్ వైట్లకు తలో వికెట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement