విజయంతో ముగింపు | Nico Rosberg takes third straight win with victory in Abu Dhabi Grand Prix | Sakshi
Sakshi News home page

విజయంతో ముగింపు

Published Mon, Nov 30 2015 1:01 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

విజయంతో ముగింపు - Sakshi

విజయంతో ముగింపు

 అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్గ్
  అబుదాబి: ఫార్ములావన్ 2015 సీజన్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్  రోస్‌బర్గ్ విజయంతో ముగించాడు. సీజన్‌లోని చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రిలో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన రోస్‌బర్గ్ గంటా 38 నిమిషాల 30.175 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఐదో స్థానాన్ని, హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని పొందారు. 19 రేసుల ఈ ఏడాది సీజన్‌లో హామిల్టన్ 381 పాయింట్లతో చాంపియన్‌గా నిలువగా... 322 పాయిం ట్లతో రోస్‌బర్గ్ రెండో స్థానంలో, 278 పాయింట్లతో వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో హామిల్టన్ పది రేసుల్లో, రోస్‌బర్గ్ ఆరు రేసుల్లో, వెటెల్ మూడు రేసుల్లో టైటిల్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement