
బెంగళూరు: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే విషయమై ఎలాంటి పరిమితి విధించలేదని టీమిండియా కెప్టె¯Œ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టె¯Œ కూడా అయిన కోహ్లి తమ ఫ్రాంచైజీకి సంబంధించిన యాప్‌ను శనివారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ప్రత్యేకించి ఇన్నే మ్యాచ్‌లు అడాలని మా వాళ్లెవరికి చెప్పలేదు. నేను ఒకవేళ 10, 12 లేదంటే 15 మ్యాచ్‌లు ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. అలాగే ఇంకొందరు ఎక్కువైనా ఆడొచ్చు.
తక్కువైనా ఆడొచ్చు. ఇది ఆయా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశం. ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదు. ప్రపంచకప్ అనేది ప్రతి ఆటగాడి కల. అందుకే ప్రతి ఒక్కరు దాన్నే లక్ష్యంగా చేసుకుంటారు. అంతేగానీ మెగా ఈవెంట్‌కు ఎవరు మాత్రం దూరమవ్వాలనుకుంటారు’ అని అన్నాడు. పని భారమనేది సహజమని, దీన్ని బాధ్యతగా తీసుకోవాలన్నాడు. ఐపీఎల్‌ను ప్రపంచకప్‌కు ఒక మెట్టుగా సద్వినియోగం చేసుకోవాలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment