
లండన్: వరల్డ్‌కప్ నుంచి శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ వైదొలిగాడు. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న నువాన్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో రాణించిన నువాన్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నువాన్ పాల్గొన్నాడు. అతని స్థానంలో కుశాన్ రజితాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈవెంట్ టెక్నికల్ కమిటీకి తెలియజేసినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ కుశాన్ రజిత ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 35 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment