తాగి బండి నడుపుతూ పట్టుబడ్డ ఒలింపిక్ ఈతగాడు
ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ మైఖేల్ ఫెల్ప్స్ తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాల్టిమోర్లోని ఫోర్ట్ మెక్హెన్రీ సొరంగంలో వెళ్లాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లి, డబుల్ లేన్ను కూడా క్రాస్ చేసినట్లు మేరీలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.40 గంటలకు ఫెల్ప్స్ వ్యవహారాన్ని రాడార్ గుర్తించింది.
గంటకు 45 మైళ్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రాంతంలో అతడు 84 మైళ్ల వేగంతో వెళ్లాడు. దాంతో 18 సార్లు ఒలింపిక్స్లో స్వర్ణపతకాలు సాధించిన అతగాడిని పోలీసులు ముందుగా అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. ఎంత మొత్తంలో మద్యం తాగాడన్న పరీక్షల్లో కూడా ఫెల్స్ప్ విఫలం అయినట్లు పోలీసులు చెప్పారు. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఫెల్స్ప్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ అందుబాటులోకి రాలేదు.