ఒలింపిక్‌ రన్‌ టీ షర్టు ఆవిష్కరణ | olympic run tea shirt launched | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ రన్‌ టీ షర్టు ఆవిష్కరణ

Published Tue, Jun 20 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

ఒలింపిక్‌ రన్‌ టీ షర్టు ఆవిష్కరణ

ఒలింపిక్‌ రన్‌ టీ షర్టు ఆవిష్కరణ

సికింద్రాబాద్‌: ఒలింపిక్‌ డే సందర్భంగా ఈనెల 23న నిర్వహించనున్న ఒలింపిక్‌ రన్‌ టీ షర్టును రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్‌ సోమవారం ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రతి ఏడాది ఒలింపిక్‌ డే రన్‌ నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టీ షర్టులను మంత్రి పద్మారావు ఆవిష్కరించారు. 

 

కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు పాండు యాదవ్, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రభు కుమార్‌గౌడ్, టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు చందు గంగపుత్ర, వెంకటరావు, ధరమ్‌రాజ్‌ చౌదరి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement