కరాచీ: వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఆ ఫార్మాట్‌లో చివరి బంతిని పాక్ బౌలర్ అజ్మల్ బౌలింగ్‌లో ఆడాడు. 2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో సచిన్... అజ్మల్ దూస్రాకు అవుటయ్యాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పాక్ స్పిన్నర్ దీని గురించి ప్రస్తావించాడు. ‘సచిన్ ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్. కాబట్టి తన వికెట్ సహజంగానే సంతోషం కలిగిస్తుంది.
దూస్రా ఆడటంలో తను ఇబ్బందిపడతాడు. దీంతో ప్రణాళిక ప్రకారం స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచి, దూస్రాతోనే మాస్టర్‌ను అవుట్ చేశాం. ఆ తర్వాత తాను మళ్లీ వన్డే ఆడలేదు. ఆ బంతితోనే సచిన్ రిటైరయ్యేలా చేశా (నవ్వుతూ సరదాగా)’ అని అజ్మల్ చెప్పాడు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రాజకీయ కారణాల వల్ల క్రికెట్ జరగకపోవడం దురదృష్టకరమని అన్నాడు. టెస్టుల్లో సంగక్కర మినహా... ప్రపంచంలో ఏ ఫార్మాట్‌లోనూ తనని ఏ బ్యాట్స్‌మన్ ఇబ్బందిపెట్టలేదని అన్నాడు.
సచిన్‌ను రిటైరయ్యేలా చేశా!
Published Fri, Aug 23 2013 1:34 AM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM
Advertisement