స్టార్క్ స్థానంలో కమిన్స్
గాయం కారణంగా భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకు దూరమైన మిషెల్ స్టార్క్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొత్త ప్లేయర్‌ను పంపించనుంది. స్టార్క్ స్థానంలో మరో పేస్ బౌలర్ పాట్రిక్ కమిన్స్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 2011లో దక్షిణాఫ్రికాపై ఏకైక టెస్టు ఆడిన 23 ఏళ్ల కమిన్స్ ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే వన్డేల్లో, టి20ల్లో, బిగ్‌బాష్ లీగ్‌లో కమిన్స్ నిలకడగా రాణించడంతో అతనికి సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది.