కోహ్లితో ఇంకా ప్రమాదమే: స్టార్క్‌ | Kohli yet threatening: Stark | Sakshi
Sakshi News home page

కోహ్లితో ఇంకా ప్రమాదమే: స్టార్క్‌

Published Wed, Mar 1 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

కోహ్లితో ఇంకా ప్రమాదమే: స్టార్క్‌

కోహ్లితో ఇంకా ప్రమాదమే: స్టార్క్‌

పుణే: తొలి టెస్టులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విఫలమైనా, అతను అంతే బలంగా తిరిగి పుంజుకోగలడని ఆస్ట్రేలియా పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ అభిప్రాయపడ్డాడు. ఆ భయం తమ జట్టుకు ఉందని, సిరీస్‌ ఇంకా ముగిసిపోలేదని అతను అన్నాడు. పుణే టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 0, 13 పరుగులు మాత్రమే చేశాడు. ‘కోహ్లి ఒక అగ్రశ్రేణి ఆటగాడనే విషయం మనందరికీ తెలుసు. కొంతకాలంగా అతను పరుగుల వరద పారిస్తున్నాడు.

అతను కోలుకొని మరింత ప్రమాదకరంగా మారతాడని అంచనా వేస్తున్నాం. మిగిలిన సిరీస్‌లో కూడా అతనిదే కీలక వికెట్‌. మేం నిజంగా సిరీస్‌ గెలవాలంటే అతడిని మరో ఆరు సార్లు అవుట్‌ చేయాల్సి ఉంది’ అని స్టార్క్‌ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో ఘనవిజయంతో శుభారంభం లభించడం తమకు అందరికీ అమితానందాన్ని ఇచ్చిందని, అయితే ఈ గెలుపుతో సిరీస్‌ దక్కదు కాబట్టి మరో మూడు మ్యాచ్‌లలో కూడా సత్తా చాటాల్సి ఉందని స్టార్క్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement