సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్‌ను వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొనసాగించేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆసక్తి చూపించలేదు. అతడితో ఉన్న ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. స్టార్క్‌కు ఈ విషయాన్ని సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేసింది. ‘కోల్‌కతా జట్టు యాజమాన్యం నన్ను వచ్చే ఏడాది కొనసాగించడం లేదని రెండు రోజుల క్రితం మెసేజ్ పంపించింది. అంటే ఆ సమయంలో నేను ఖాళీగా ఉండబోతున్నాను’ అని స్టార్క్ వెల్లడించాడు. 2018 వేలంలో రూ. 9.4 కోట్ల భారీ మొత్తానికి స్టార్క్‌ను నైట్‌రైడర్స్ తీసుకున్నా... గాయం వల్ల అతను టోర్నీ ఆరంభానికి ముందే దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment