న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన అజేయ రికార్డును కొనసాగిస్తున్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసుకున్న హరికృష్ణ ఎనిమిదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు.. నైజేల్ షార్ట్ (ఇంగ్లండ్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 56 ఎత్తుల్లో విజయం సాధించాడు.ఎసెర్‌మన్ (అమెరికా) తో గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా...జోల్టాన్ (హంగేరి)తో జరిగిన గేమ్‌లో హారిక 56 ఎత్తుల్లో ఓడిపోయింది.
ఆధిక్యంలో హరికృష్ణ
Published Thu, Feb 4 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement