
సిడ్నీ: టీమిండియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా వెనుకంజ వేయవద్దని తెలిపాడు. ఈ క్రమంలోనే కోహ్లిపై స్లెడ్జింగ్‌కు దిగితే మరింత ప్రమాదమన్న పలువురు మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలతో పాంటింగ్ విభేదించాడు. కోహ్లిని తొందరగా పెవిలియన్‌కు పంపడానికి కవ్వింపు చర్యలకు దిగడంలో తప్పులేదన్నాడు.
‘పదునైన బౌన్సర్ తరహా బంతులతో ఇబ్బంది పెట్టాలి. థర్డ్ మ్యాన్ దిశగా బంతిని నెట్టి పరుగులు రాబట్టేందుకు కోహ్లి ఎక్కువగా ప్రయత్నిస్తాడు. కాబట్టి.. కీపర్ పక్కనే మంచి ఫీల్డర్‌ని మొహరించాలి. కోహ్లిపై విజయం సాధించిన ఆటగాళ్లు ఎవరెలా..? అని విశ్లేషిస్తే.. తొలుత స్ఫురించిన పేరు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. అతను చాలా సందర్భాల్లో కోహ్లీని తన బౌలింగ్‌లో ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యాడు. ఆ టెక్నిక్‌ను ఆసీస్ అనుసరించాలి. వైవిధ్యమైన బంతులతో కోహ్లిని టార్గెట్ చేయాలి. బంతిని స్వింగ్ చేయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమైతే కోహ్లిని కట్టడి చేయడం కష్టం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment