
‘బాస్కెట్’లో పడ్డాడు...
ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ నిశ్చితార్థం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. భారత బాస్కెట్‌బాల్ జట్టు సభ్యురాలైన ప్రతిమా సింగ్‌తో ఆదివారం ఇషాంత్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. వారణాసికి చెందిన 26 ఏళ్ల ప్రతిమ, బాస్కెట్‌బాల్‌లో సత్తా చాటిన ‘సింగ్ సిస్టర్స్’లో ఒకరు. ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లలో నలుగురు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.