'ఆడాళ్లతో ఉండడం కష్టం' | Pregnant or otherwise, it’s not easy to stay with a woman: Harbhajan Singh | Sakshi
Sakshi News home page

'ఆడాళ్లతో ఉండడం కష్టం'

Published Tue, Jul 12 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

'ఆడాళ్లతో ఉండడం కష్టం'

'ఆడాళ్లతో ఉండడం కష్టం'

ఆడాళ్లతో వేగడం కష్టమేనని టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

న్యూఢిల్లీ: ఆడాళ్లతో వేగడం కష్టమేనని టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 'గర్భంతో ఉన్నా లేదా మామూలుగా ఉన్న ఆడాళ్లతో సమయం గడపడం చాలా కష్టమ'ని పేర్కొన్నాడు. ఆలుమగల మధ్య సదావగాహన ఉంటే సంసారం సాఫీగా సాగిపోతుందని కూడా అన్నాడు.

హర్భజన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నానని 36 ఏళ్ల భజ్జీ తెలిపాడు. గీత(32)ను గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు.

తన బిడ్డ ఇంగ్లండ్ లో పుడుతుందని చెప్పాడు. గీత బ్రిటీష్ పౌరురాలని, ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement