తొలిసీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్ ప్రొకబడ్డీ లీగ్‌లో ఆరో విజయం తన ఖాతాలో వేసుకుంది.
కోల్‌కతా: తొలిసీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్ ప్రొకబడ్డీ లీగ్‌లో ఆరో విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 33-27తో జయకేతనం ఎగరవేసింది. మ్యాచ్ 14వ నిమిషంలో పుణేను ఆలౌట్ చేసిన జైపూర్ 12-7తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత జోరును కొనసాగించి తొలి అర్ధభాగం ముగిసేసరికి 17-9తో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.
రెండో అర్ధభాగంలో మరోసారి పుణేను ఆలౌట్‌చేసి 25-14కు ఆధిక్యం పెంచుకుంది. ఆ తర్వాత పుణే పుంజుకున్నా.. జైపూర్ మాత్రం తన జోరుమాత్రం తగ్గించలేదు. దాంతో విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో పుణే ఆటగాళ్లు దీపక్ నివాస్ హుడా, అజయ్ ఠాకూర్ తొమ్మిదేసి పాయింట్లతో రాణించగా.. జైపూర్ ఆటగాళ్లు రాజేష్ నర్వాల్, జస్వీర్ సింగ్ ఏడేసి పాయింట్లతో సత్తాచాటారు.