
చెన్నై: మ్యాచ్ ముగిసేందుకు మరో 10 నిమిషాలే మిగిలి ఉంది. పుణేరి పల్టన్ 16–15తో తమిళ్ తలైవాస్‌పై కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలోనే ఉంది. నిర్ణీత సమయం తర్వాత చూస్తే 33–20తో పుణేరి జయభేరి మోగించింది. ఒక్కసారిగా స్వల్ప వ్యవధిలో పుణేరి ఆటగాళ్లు చెలరేగారు. రెండు సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు.
దీపక్ (6), రాజేశ్ (5), మోను (4) రాణించారు. తలైవాస్ తరఫున డాంగ్ లీ, అజయ్ 4 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 30–29తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధ, తలైవాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.