ప్రతిష్టాత్మక టోర్నీ.. సింధు శుభారంభం
దుబాయ్: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. దుబాయ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన గ్రూపు దశ తొలి మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ అకానె యామగుచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు ఆపై రెండో గేమ్‌లో ప్రత్యర్థి యామగుచికి అవకాశమే ఇవ్వలేదు. రెండో గేమ్ సింధు నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో జపాన్ షట్లర్ కాస్త ప్రతిఘటించినా ర్యాలీలతో సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. పాయింట్ల అంతరాన్ని కొనసాగిస్తూ వచ్చిన సింధు మూడో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సింధు తన తర్వాతి మ్యాచ్‌లో సున్ యు (చైనా)తో తలపడనుంది.