కరోలినాపై సింధు గెలుపు
దుబాయ్: ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో శుక్రవారం జరిగిన గ్రూప్-బి థర్డ్ మ్యాచ్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ ను సింధు ఓడించింది. 21-17, 21-13 తేడాతో విజయం సాధించింది.
తాజా విజయంతో పీవీ సింధు సెమీస్కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో యామగుచిపై సింధు గెలవగా.. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా) చేతిలో సింధు 15–21, 17–21తో ఓటమి పాలైన విషయం తెలిసిందే.