సింధుకు షాక్ | PV Sindhu Bows out of Syed Modi Grand Prix, Kidambi Srikanth Enters Quarterfinals | Sakshi
Sakshi News home page

సింధుకు షాక్

Published Fri, Jan 29 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

PV Sindhu Bows out of Syed Modi Grand Prix, Kidambi Srikanth Enters Quarterfinals

ప్రిక్వార్టర్స్‌లో ఓటమి
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, కశ్యప్
సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ


లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఊహిం చని షాక్ ఎదురైంది. గత ఆదివారం మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గి ఊపు మీదున్న సింధు గురువారం హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో 21-18, 24-26, 17-21 తేడాతో ప్రపంచ 27వ ర్యాంకర్ జిందాపోల్ (థాయ్‌లాండ్)చేతిలో ఓడింది.  గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సింధు గెలుచుకున్నా ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయింది.

మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-9, 21-12 తేడాతో ఇస్కందర్ జైనుద్దీన్‌పై  సునాయాసంగా నెగ్గి క్వార్టర్స్ చేరాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ కశ్యప్ కూడా 21-19, 21-10 తేడాతో జు సియువాన్ (చైనా)పై గెలిచాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ గుత్తా జ్వాల, అశ్విని జంట 21-9, 21-10 తేడాతో నింగ్‌షి బ్లాక్ హజారికా, హారికపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement