మళ్లీ అతడేనా! | Rafael Nadal and Novak Djokovic set for French Open final | Sakshi
Sakshi News home page

మళ్లీ అతడేనా!

Published Sun, Jun 8 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

మళ్లీ అతడేనా!

మళ్లీ అతడేనా!

జొకోవిచ్‌తో నాదల్ అమీతుమీ
 నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
 
 పారిస్: మట్టి కోర్టులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ఆదివారం జరిగే ఫ్రెంచ్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు.
 
  ఇప్పటికే రికార్డుస్థాయిలో 8 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్‌కు ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఒక్క పరాజయం ఎదురైంది. 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయిన నాదల్ ఆ తర్వాత గత నాలుగేళ్లుగా టైటిల్‌ను నిలబెట్టుకుంటున్నాడు.
 ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. దాంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ సెర్బియా స్టార్ ఫామ్ పరిగణనలోకి తీసుకుంటే ఆదివారం అద్భుతం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 నాదల్, జొకోవిచ్ ముఖాముఖిగా 41 సార్లు పోటీపడ్డారు. నాదల్ 22 సార్లు, జొకోవిచ్ 19 సార్లు గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ ఐదుసార్లు తలపడగా... ఐదు పర్యాయాలూ నాదల్‌నే విజయం వరించింది.
 
  తాను ఆడిన 8 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో నాదల్ మూడింటిని మూడు సెట్‌లలో... మిగతా ఐదింటిని నాలుగు సెట్‌లలో గెలిచాడు. ఏ ఫైనల్ కూడా ఐదు సెట్‌లు జరగకపోవడం నాదల్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.
 
 సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement