రాఫెల్‌ నాదల్‌ ఖాతాలో 34వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ | Rafael Nadal downs Novak Djokovic for 9th Italian Open title | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ నాదల్‌ ఖాతాలో 34వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌

Published Mon, May 20 2019 5:07 AM | Last Updated on Mon, May 20 2019 9:04 AM

Rafael Nadal downs Novak Djokovic for 9th Italian Open title - Sakshi

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నమెంట్‌లో నాదల్‌ తొమ్మిదోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6–0, 4–6, 6–1తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్‌ అత్యధికంగా 34 మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. విజేత నాదల్‌కు 9,58,055 యూరోల (రూ. 7 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement