యూఎస్ ఓపెన్ 2017: ఫైనల్‌కు నాదల్
యూఎస్ ఓపెన్ 2017: ఫైనల్‌కు నాదల్
Published Sat, Sep 9 2017 8:22 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM
సాక్షి, వాషింగ్టన్: టెన్నిస్ సంచలన స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అమెరికా ఓపెన్ టోర్నీ ఫైనల్ కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రోపై విక్టరీ సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో విక్టరీ సాధించాడు.
కాగా, ఈ విజయంతో తన కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ లో అడుగుపెట్టగా, 2013 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు నాదల్ చేరుకోవటం విశేషం. డెల్ పొట్రో రోజర్ ఫెదరర్ ను ఓడించి ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్, పబ్లో బుస్తాను ఓడించి ఫైనల్ కు చేరాడు. సెప్టెంబర్ 11న మెన్స్ సింగిల్స్ టైటిల్ కోసం నాదల్-అండర్‌సన్‌ల మధ్య పోరు జరగనుంది.
Advertisement
Advertisement