రెండో రౌండ్లో రాహుల్, ఆర్యన్ | Rahul,Aryan entered in second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్లో రాహుల్, ఆర్యన్

Published Sun, Jun 8 2014 1:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Rahul,Aryan entered in second round

ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాహుల్, ఆర్యన్ లడ్హా ముందంజ వేశారు. ఏస్టర్ టెన్నిస్ అకాడమీలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో శనివారం బాలుర అండర్-12, 14 సింగిల్స్ తొలిరౌండ్ పోటీలు జరిగాయి. అండర్-12లో రాహుల్ 7-3తో శ్రీచరణ్‌పై, ఆర్యన్ 7-2తో అనికేత్ మోడిపై గెలుపొందారు.
 
  ఇతర మ్యాచ్‌ల్లో ఆర్య జాదవ్ 7-3తో వేదాంత్‌పై, అమోగ్ పెద్దిరెడ్డి 7-1తో జైకృష్ణ పాల్‌పై, శశివర్ధన్ రెడ్డి 7-6 (7/5)తో రిత్విక్ యాదవ్‌పై, శ్రీకార్తీక్ 7-1తో దేవేందర్‌పై విజయం సాధించారు. ఆర్యన్ లాహ 7-2తో తరుణ్ సేపూరిపై నెగ్గగా, అర్చిత్ 7-5తో సయ్యద్ ఫజల్ అలీని ఓడించాడు. రాహుల్ చందన్ 7-1తో కార్తీక్ వడ్డేపల్లిపై, శౌర్య బన్సాల్ 7-2తో సాక్షం గుప్తాపై, యశ్వంత్ 7-1తో ఆమిర్ కపాడియాపై, ముకుంద్ రెడ్డి 7-1తో ఆదిత్యపై, ప్రమోద్ 7-2తో పులకిత్‌పై నెగ్గారు. నవనీత్ సింగ్‌కు 1-7తో జై అర్జున్ చేతిలో, రోహన్‌కు 3-7తో అక్షిత్ చేతిలో చుక్కెదురైంది.
 
 బాలుర అండర్-14 ఫలితాలు
 శశి ప్రీతమ్ 7-2తో సాయి స్నేహల్‌పై, రాహుల్ 7-3తో సుహిత్ రెడ్డిపై, సీహెచ్ అనికేత్ 7-2తో రిత్విక్ యాదవ్‌పై, కౌషిక్ రెడ్డి 7-0తో పద్మేశ్‌పై, సాయి పృత్విక్ 7-2తో అర్చిత్, యువరాజ్ రాలేపల్లి 7-1తో సాక్షం గుప్తాపై, సయ్యద్ పాషా 7-2తో ఆమిర్ కపాడియాపై, రాహుల్ చందన్ 7-4తో సుమంత్ రెడ్డిపై గెలుపొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement